పొన్నూరు: డివిసి కాలనీకి చెందిన సుబాని వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని ఐలాండ్ సెంటర్ సమీపంలో ఓ హోటల్ ఎదుట శవమై కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa