జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లో మంగళవారం ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఓ కాశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపారు. ఉగ్రవాదుల దాడిలో మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. మృతుడిని సునీల్ కుమార్ భట్‌గా, గాయపడిన వ్యక్తి అతని సోదరుడు పింటుగా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనపై మాజీ సీఎం అబ్దుల్లా సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన మోడీ ప్రభుత్వ వైఫల్యానికి మరో ఉదాహరణ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.