బాదంపప్పు, పిస్తా, అక్రోట్ వంటి గింజలు ప్రోటీన్లతో నిండి ఉంటాయి. సోయాబీన్స్ లో కూడా ప్రొటీన్ల మోతాదు ఎక్కువగా ఉంటుంది. పాల పదార్థాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి. గుండె జబ్బు, మధుమేహం ముప్పును దూరంగా ఉంచుతాయి. బఠాణీలు, రాజ్మా, బీన్స్, చిక్కుళ్లు, ఇతర కూరగాయల్లోనూ ప్రోటీన్లు ఉంటాయి. చేపలు, మాంసాహారంలో కూడా ప్రోటీన్లు దండిగా ఉంటాయి.