ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైన విద్యార్థులకు కూడా ఈ ఏడాది ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు ఇవ్వాలని మంత్రి మేరుగ నాగార్జున ఆదేశించారు. అమరావతి సచివాలయంలో మంగళవారం డీసీవోలతో ఆయన సమీక్ష నిర్వహించారు. టెన్త్ సప్లిమెంటరీలో పాసైన విద్యార్థులకు గురుకులాల్లో అడ్మిషన్లు ఇవ్వకూడదనే నిబంధనను ఈ ఏడాదికి సడలించాలని ఆదేశించారు. అలాగే అదనపు సీట్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa