వెలిగండ్ల మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరైనట్లు ఎంఈవో దాస్ ప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసి విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన తరగతి గదులను నిర్మించడం జరుగుతుందన్నారు. భావితరాలకు బాటలు వేసే విధంగా నిర్మాణాలు ప్రతిష్టాత్మకంగా చేపడతామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa