అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి డి.జయకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో అన్నాడీఎంకే చాలా బలంగా ఉందని జయకుమార్ అన్నారు. పన్నీర్ సెల్వం పదుల సంఖ్యలో మాజీ నాయకులను వెంటేసుకుని అన్నాడీఎంకేను చేజిక్కించుకుంటానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. శశికళ, దినకరన్‌లను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని జయకుమార్ తేల్చి చెప్పారు.