ట్విట్టర్ కొనుగోలుపై వెనక్కి తగ్గిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ టీంను కొనుగోలు చేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. 'నిజం చెప్పాలంటే నేను రిపబ్లికన్ పార్టీ ఎడమ భాగాన్ని, డెమోక్రాటిక్ పార్టీ కుడి భాగాన్ని సపోర్ట్ చేస్తా' అని ట్వీట్ చేసిన మస్క్ ఆ వెంటనే 'నేను మాంచెస్టర్ యూనైటెడ్ను కూడా కొంటున్నా. మీ అందరికీ స్వాగతం' అని మరో ట్వీట్ చేశారు.