ఓ రైతు కలలో శనిదేవుడు కనిపించి ఓ కోటలో తన విగ్రహం ఉందని చెప్పాడు. కలలో చెప్పినట్లుగా ఆ రైతు అక్కడికి వెళ్లి వెతకగా నిజంగానే శనిదేవుడి విగ్రహం కనిపించింది. ఈ ఆశ్చర్యకరమైన ఘటన మహారాష్ట్రలోని తక్లిభాన్‌లోని రాజ్‌వాడ ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో సాక్షాత్తూ శనిదేవుడు అక్కడ వెలిశాడని అంటున్నారు భక్తులు. ఈ విగ్రహాన్ని చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. ఆ శిల నుదిటిపై చంద్రవంక ఆకారం చెక్కబడి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa