ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి కేంద్రం జెడ్ కేటగిరీ భద్రత కల్పించనుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం సీఆర్పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. అదానీ భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జెడ్ కేటగిరీ భద్రత పొందనున్న అదానీ, నెలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.