అప్పుడప్పుడు కిక్కిరిసిన భక్తజనం తిరుమల కొండపైన కనిపించడం సర్వ సాధారణంగా మారిపోయింది. అటు పెరుగుతున్న భక్తుల రద్దీతో టీటీడీ కూడా కొన్ని సార్లు అనుగుణమైన ఏర్పాట్లు చేయలేక చేతులెత్తేయవలసిన దుస్ధతి నెలకొంది.అయితే.. భక్తులు అనూహ్యంగా పెరుగుతుండటానికి కారణాలేంటి..? రద్దీకి అనుగుణంగా దేవస్థానం ముందస్తుగా ప్రణాళికలు వేసుకోలేక పోతుందా..? లేదా అనూహ్యంగా భక్తులు రావడాన్ని నివారించలేకపోతోందా..? తిరుమల కొండపై అప్పుడప్పుడు తలెత్తే ఈ సమస్యలకు కారణం ఏంటి..?ఒక్క తిరుమల కొండపైనే భక్తులు రావాద్దు.. యాత్రను వాయిదా వేసుకోండి అన్న విజ్నప్తిని తరచూ వినాల్సి వస్తోంది. ఎందుకంటే సెలవు దొరికితే చాలు కొండెక్కుద్దామన్నటువంటి ఆలోచనలోకి భక్తులు వచ్చేస్తున్నారు. వరుస సెలవులు అయితే సకుటుంబ సపరివార సమేతంగా శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సాధారణంగా భక్తులు ఎవరైనా ముందస్తుగా ప్రణాళిక చేసుకోకుండా వస్తే ఇక్కడ ముప్పుతిప్పలు తప్పడం లేదనే టాక్ వినబడుతోంది.
తిరుమల కొండపైనా రద్దీ ఎక్కువ అయితే వసతి సౌకర్యాలు కరువతాయి. దీంతో వచ్చిన యాత్రికులు తిప్పలు పడాల్సి వస్తుంది. దీంతో భక్తులను రావొద్దని టీటీడీ విజ్నప్తి చేయాల్సి వస్తోంది. అయితే సరైన ప్రణాళిక ఉంటే సమస్య తలెత్తదని అంటున్నారు భక్తులు.