విశాఖపట్నంలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యారు. అప్పుఘర్‌కు చెందిన బి.అనిల్‌కుమార్(36) అనే రౌడీ షీటర్ బుధవారం సాయంత్రం శ్యామ్ ప్రకాశ్, షమీర్, ఎర్రయ్య ముగ్గురు మిత్రులతో కలిసి ఉషోదయ చౌరస్తాలోని ఓ బార్లో మద్యం తాగారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో శ్యామ్ ప్రకాశ్ మరో మిత్రుడితో కలిసి అనిల్‌పై కత్తితో పీక కోసి, పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అనిల్ అక్కడిక్కడే మృతి చెందాడు.