ఎడ్లపాడు మండలం తుర్లపాడులోని పంచాయితీ కార్యాలయం వద్ద బుధవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రావూరి వేణుగోపాల్ ప్రారంభించారు. శుక్లాలు ఉన్నవారికి కారం చేడులో ఉన్న ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేసి శుక్లాలు తొలగించి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే పెద్ద పెద్ద నేత్ర సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు.