కాళేశ్వరం తెలంగాణ ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు నిర్మించినప్పుడే వేలకోట్ల అవినీతి జరిగిందని, పంప్‌ల రిపేర్లలోనూ అవినీతికి ఆస్కారం ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మోటార్లు బిగించిన సంస్థకు టెక్నికల్ సామర్థ్యం లేదని, వాటిని అమర్చడంలో సరైన పద్దతి పాటించలేదని కేంద్రమంత్రి దుయ్యబట్టారు.