గడపగడపకు వైసీపీ ప్రోగ్రాం లో చిన పలకలూరు గ్రామానికి అన్యాయం జరిగిందని జనసేన నాయకుడు బందలపాటి సాంబశివరావు వైసీపీ నాయకులని ప్రశ్నించారు. అలా ప్రశ్నించినందుకు అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా స్టేషన్ కి తీసుకురావడం జరిగింది .
ఈ విషయం తెలుసుకొని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు నల్లపాడు పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఈ విషయం గురుంచి పూర్తి వివరాలు తెలుసుకోని బాధిత జనసైనికుడికి అండగా నిలవడం జరిగింది.