ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పింగళి వెంకయ్య విగ్రహ ఆవిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 12:05 PM

భారత జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య నుంచి నేటి తరం ఉద్యమ స్ఫూర్తిని పొందాలని కృష్ణా  జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా అన్నారు . మంగళవారం సాయంత్రం ఆయన మోపిదేవి మండలం పెద్దకళ్ళేపల్లి గ్రామంలో పింగళి వెంకయ్య విగ్రహ ఆవిష్కరణలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ జెండా రూపకర్త , స్వాతంత్ర్య సమరయోధులు పింగళి వెంకయ్య జీవిత చరిత్ర నేటి తరానికి ఎంతో ఆదర్శమన్నారు .


కార్యక్రమానికి ముందు ఎన్ . సి . సి . విద్యార్థులు అతిధులకు మార్చ్ ఫాస్ట్ తో గ్రామంలో ఆహ్వానం పలికారు . కార్యక్రమానంతరం కలెక్టర్ , గౌరవ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాలగారు పేదకళ్లేపల్లిలోని ఆలయాన్ని దర్శించుకున్నారు .


ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ . పీ . పి . జాషువా గారు , గ్రామ సర్పంచ్ అర్జా సంధ్యారాణి గారు , పలువురు ప్రజా ప్రతినిధులు , విద్యార్థులు , గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు . 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com