శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం ఇన్ ఫ్లో 2,77,589 క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 2,57,262 క్యూసెక్కులుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.30 అడుగులుంది. నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం 211.4759 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.