బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చోటుచేసుకున్న వ్యవస్థాగత మార్పులపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. ఆఫీస్ బేరర్లను నియమించేందుకు పార్టీ సంస్థాగత ఎన్నికలను దూరం పెట్టిందన్న ఆయన.. ప్రధాని మోదీ ఆమోదంతోనే సభ్యులంతా నామినేట్ అవుతున్నారని ఆరోపించారు. గతంలో ఆఫీస్ బేరర్ల నియామకాలన్నీ పార్టీలో ఎన్నికల ద్వారానే జరిగేవని స్వామి ట్వీట్ చేశారు.