గతంలో కేఎల్ రాహుల్ నాలుగు మ్యాచ్‌లకు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా, ఆ జట్టు అన్నింటిలోనూ ఓడిపోయింది. ఈ చెత్త రికార్డును చెరిపేసే లక్ష్యంతో జింబాబ్వేతో తొలి వన్డేలో అడుగుపెట్టిన అతడు.. అనుకున్నది సాధించాడు. 10 వికెట్లతో తొలి విజయాన్ని అందుకున్నాడు. 190 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ నష్టపోకుండా కేవలం 30.5 ఓవర్లలో ఛేదించింది. గిల్ (82), ధావన్ (81) పోటీపడి పరుగులు సాధించారు. ఈ విజయంతో కెప్టెన్ గా రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన రాహుల్ కు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ సత్తా చాటే అవకాశం రాలేదు. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు రాహుల్ తన ఓపెనింగ్ స్థానాన్ని వదులుకున్నాడు. ఇది మెచ్చుకోదగ్గ విషయమే.. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం ఆలపిస్తూ రాహుల్ చేసిన మరో పనికి అభిమానులు షాక్ అయ్యారు. భారత జాతీయ గీతాన్ని ప్రకటించినప్పుడు, రాహుల్ తన నోటి నుండి చూయింగ్ గమ్‌ని తీసి కింద పడేశాడు. జాతీయ గీతానికి ఆయన ఇచ్చిన గౌరవం అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను అభిమానులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నామని కొందరు వ్యాఖ్యానించారు.
KL Rahul took out the Chewing Gum from his Mouth before National Anthem
Proud of You @klrahul #INDvsZIM | #CricketTwitter pic.twitter.com/3FzCUnZAQF
— KingShetty (@Kingshetty45) August 18, 2022