గుంటూరు: సర్వజనాసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. జూమ్ కాన్ఫరెన్స్ లో గురువారం సూపరింటెండెంట్ ప్రభావతితో మాట్లాడుతూ శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో పని చేసే ఒప్పంద ఉద్యోగులకు కూడా బయోమెట్రిక్ హాజరు ఉంటేనే జీతాలు చెల్లిస్తామన్నారు. ఉద్యోగుల ఖాళీల వివరాలను తెలియజేస్తే భర్తీకి అనుమతిస్తామన్నారు.