ప్రత్తిపాడు: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద నిలిపిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఎస్సై ప్రతాప్ కుమార్ తెలిపిన మేరకు పెదనందిపాడు మండలం రావిపాడు వాసి షేక్ ఖాజావలి 108 చోదకుడిగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఖాజావలి తన ద్విచక్ర వాహనాన్ని సీ హెచ్ సీ ఎదురుగా ఉంచి విధులకు వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా ద్విచక్ర వాహనం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa