మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పానీపూరీ వ్యాపారి 1.01 లక్షల పానీపూరీలను ఉచితంగా పంపిణీ చేశాడు. భోపాల్ లోని కోలార్ కు చెందిన ఆంచల్ గుప్త తన కూతురి మొదటి పుట్టిన రోజు సందర్భంగా ఇలా చేశాడు. 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకే ఇలా చేశానన్నాడు. ఆయనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసలు కురిపించారు. పానీపూరీ పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ హాజరయ్యారు.