ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోదియా నివాసంలో శుక్రవారం సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు. కేజ్రీవాల్ ప్రభుత్వం గతేడాది నవంబర్లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ-2022 నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టింది. సిసోదియా నివాసంతో పాటు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని 21 చోట్ల ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.