జగనన్న విద్యాదీవెనలో ఆర్థిక సాయం పొందేందుకు అర్హులైన మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి మస్తాన్ వలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలోని మొదటి 200 ర్యాంకులున్న విదేశీ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే మైనార్టీ విద్యార్థులు సెప్టెంబరు 30వ తేదీలోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.