ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈటీ 343 ఫ్లైట్ 37 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఇద్దరు పైలట్లు నిద్రపోయారు. ఈ నెల 15న ఈ ఘటన జరిగింది. సూడాన్‌లోని ఖార్టూమ్ ఎయిర్‌పోర్టులో బయల్దేరిన ఈ ఫ్లైట్ ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో ల్యాండింగ్ కావాల్సి ఉంది. ఆటోపైలట్ ఆఫ్ అయిన తర్వాత అలారం మోగడంతో పైలట్లు నిద్రలేచారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులకు ముప్పు తప్పింది.