ముంబైలోని విరార్ ప్రాంతంలో 11 ఏళ్ల బాలికకు 21 ఏళ్ల మహిళతో ఫోన్ రిపేర్ షాప్‌లో పరిచయం ఏర్పడి ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఇటీవల తనతో వాకింగ్‌కు వచ్చిన 11 ఏళ్ల ఫ్రెండ్‌ను మహిళ(21) నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లింది. అనంతరం తన ముగ్గురు పురుష స్నేహితులను పిలిచి వారిచేత మైనర్‌పై సామూహిక అత్యాచారం చేయించింది. అంతేకాకుండా ఈ దారుణాన్ని ఆమె అక్కడే కూర్చుని చూసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.