అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఆయన నందిగామలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని రైతులకు అండగా ఉంటామని, అందుకోసమే రాజధాని చుట్టూ అభివృద్ధి జరుగుతోందని అన్నారు. రాజధాని ఎవరైతే కట్టుకోలేదో వాళ్లదే పాపమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 21న విజయవాడలో బహిరంగ సభ జరుగుతుందని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వీర్రాజు పిలుపిచ్చారు.