బ్లాక్ టీ వల్ల ఆరోగ్యానికి అనేక రకాల మంచి జరుగుతుంది. రోజుకు ఓ కప్పు బ్లాక్ టీ తాగితే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసే బ్యాక్టీరియా పెరగడానికి బ్లాక్ టీ కారకమవుతుంది. బ్లాక్ టీ వల్ల శరీరంలోని అదనపు కేలరీలు ఈజీగా తగ్గుతాయి. రొమ్ము కేన్సర్ ని అడ్డుకోవడంలో బ్లాక్ టీ బాగా పనిచేస్తుంది. డయేరియా వ్యాధిగ్రస్తులు బ్లాక్ టీ తాగితే వెంటనే ఉపశమనం పొందే అవకాశం ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు బ్లాక్ టీలో ఉన్నాయి. బ్లాక్ టీ తాగితే నోటి దుర్వాసన కూడా రాదు. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమవుతాయి. బ్లాక్ టీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.