హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద ఉధృతికి కంగ్రా జిల్లాలోని చక్కి రైల్వే బ్రిడ్జ్ శనివారం కూలిపోయింది. జిల్లా మెజిస్ట్రేట్ రోహిత్ రాథోడ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. భారీ వరదకు బ్రిడ్జి మధ్య భాగం కూలిపోయినట్లు వెల్లడించారు. ఆ రాష్ట్రంలో వరదల ధాటికి పలువురు నిరాశ్రయులయ్యారు. కొండ చరియలు విరిగి పడిన ఘటనల్లో ఇప్పటికే 14 మంది చనిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa