ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ పై తనుశ్రీ దత్త సంచలన వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 08:47 PM

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త, బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2006లో ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనమని నిర్వాహకులు 11 ఏళ్లుగా ఆహ్వానిస్తున్నా, తాను ఆ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు ఆమె తెలిపారు. అందరూ ఒకే గదిలో పడుకోవడం, తగువులు పెట్టుకోవడం తనకు నచ్చదని, ఆ పరిస్థితుల్లో ఉండలేనని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆధ్యాత్మికతలో మునిగిపోయి, అమెరికాలో స్థిరపడిన తనుశ్రీ, ఈ వ్యాఖ్యలు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa