ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' నుండి వయ్యారి వయ్యారి సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 08:26 AM

ప్రముఖ టాలీవుడ్ నటుడు తిరువీర్ ఇప్పుడు ప్రధాన పాత్రలో తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా టీజర్ మూవీ పై భారీ అంచనాలని పెంచింది. ఈ చిత్రం 7 నవంబర్ 2025న విడుదల అవుతోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని వయ్యారి వయ్యారీ అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ పాటను సురేష్ బొబ్బిలి ట్యూన్ చేసారు మరియు సనారే సాహిత్యం అందించారు. ఈ సాంగ్ కి యశ్వంత్ నాగ్ మరియు సింధుజా శ్రీనివాసన్ తమ గాత్రాలని అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో టిను శ్రావ్య మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. రోహన్ రాయ్ మరియు నరేంద్ర ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సందీప్ అగరం మరియు అష్మిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ నాయక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa