గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మాణంలో దర్శకుడు దిలీప్ రాజా దర్శకత్వం వహించిన చిత్రం పండుగాడి ఫోటో స్టూడియో. హాస్యనటుడు అలీ హీరోగా రిషిత నాయికగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఎవరి సినిమా వారికి నచ్చుతుంది. కానీ నచ్చాల్సింది ప్రేక్షకులకు. వారికి నచ్చితేనే సినిమా విజయం సాధిస్తుంది. విభిన్నమైన కథతో పండుగాడి ఫోటో స్టూడియో చిత్రాన్ని తెరకెక్కించాను. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రంలో ఆలీ పంచే వినోదం అందరి కడుపుబ్బా నవ్విస్తుంది అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa