క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు సమర్పిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలోని విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ విడుదలైంది. కె.ఎ.వల్లభ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ముఖంపై ఉన్న మరకలు క్యారక్టర్ ఇన్‌టెన్‌సిటీని తెలియజేస్తాయని దర్శకుడు సెన్సిబుల్ కథాంశాన్ని అద్భుతంగా తెరకెక్కించారన్నారు. టైటిల్ జస్టిఫికేషన్ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నాం అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa