రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార: చాప్టర్ 1' కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.655 కోట్లు వసూలు చేసింది. 12వ రోజుతో కలిపి రూ.700 కోట్ల క్లబ్‌కు చేరువ కానుంది. భారతదేశంలో రూ.438 కోట్లు వసూలు చేయగా, హిందీ వెర్షన్ రూ.144.5 కోట్లు రాబట్టింది. రెండో సోమవారం రూ.19 కోట్లు కలెక్ట్ చేసింది. దీపావళి సెలవులతో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉందని సమాచారం. ఉత్తర భారతదేశంలో ఈ చిత్రానికి సరైన ప్రచారం లేదనే విమర్శలు ఉన్నాయి.