తమిళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మెగాఫోన్ పట్టి దర్శకత్వం చేయనున్న తన సినిమాకి 13 ఏళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంచుకున్నారు. ఈ 13 ఏళ్ళ కుర్రాడి పేరు లైడియన్ నాదస్వరం.. అంత చిన్న వయసులోనే తన సంగీత జ్ఞానంతో ఏఆర్ రెహ్మాన్, మోహన్ లాల్ వంటి సినీ ప్రముఖులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఓ బంగారంలాంటి అవకాశాన్ని అందుకున్నాడు. సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు.
ఈ చిత్రాన్ని పూర్తి 3డీ టెక్నాలజీతో "బరోజ్" పేరుతో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు సంగీతదర్శకుడిగా నాదస్వరంను తీసుకున్నారు. 13 ఏళ్ల వయసులోనే అరుదైన అవకాశం అందుకున్న నాదస్వరంను మలయాళ, తమిళ సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa