ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే 99 సాంగ్స్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న ఆయన త్వరలోనే ఓ మల్టీస్టారర్‌ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అందులో కమల్‌హాసన్‌తో పాటు పలువురు జాతీయ స్థాయి అగ్ర నటులు నటించనున్నారట. అయితే దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. కమల్ నటిస్తున్న భారతీయుడు 2 తర్వాత ఆ చిత్రం మొదలవుతుందని సమాచారం. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa