ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన తన ప్రేయసి నయనికతో నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శుక్రవారం ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభవార్తను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ సంతోషకరమైన సందర్భంలో అల్లు అర్జున్ తన తమ్ముడికి, కాబోయే మరదలికి శుభాకాంక్షలు తెలిపారు. "మా ఇంట్లో వేడుకలు మొదలయ్యాయి! మా కుటుంబంలోకి కొత్త సభ్యురాలు వచ్చారు. ఈ ఆనంద క్షణం కోసం మేం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం. నా ప్రియమైన సోదరుడు అల్లు శిరీష్‌కు అభినందనలు. నయనికకు మా కుటుంబంలోకి సాదర స్వాగతం. మీ ఇద్దరి కొత్త ప్రయాణం ప్రేమ, సంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa