యాంకర్, నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు కోలీవుడ్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ నటుడు, డ్యాన్సర్ ప్రభుదేవా హీరోగా నటిస్తున్న 'ఊల్ఫ్' అనే తమిళ చిత్రంలో ఆమె ఓ ప్రత్యేక గీతంలో మెరిశారు. ఈ పాటకు సంబంధించిన వీడియో తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వినూ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న 'ఊల్ఫ్' చిత్రం నుంచి చాలాకాలంగా ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ చిత్రబృందం 'సాసా సాసా' అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటలో అనసూయ తన గ్లామర్ లుక్‌తో ఆకట్టుకుంటూ ప్రభుదేవాతో కలిసి రొమాంటిక్‌గా స్టెప్పులేశారు. ఆమె అభినయం, డ్యాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa