రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు ముందు, హీరో విజయ్ దేవరకొండ చిత్ర బృందంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చాలా శక్తిమంతంగా ఉంటుందని, కచ్చితంగా ప్రేక్షకులపై ప్రభావం చూపుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. "వాళ్లు ఒక పవర్‌ఫుల్ సినిమా తీశారని నాకు తెలుసు. ఇది చాలా ముఖ్యమైన చిత్రం. దీన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఈ సినిమాలో నటీనటులందరి నటన అద్భుతంగా ఉంటుంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. రష్మిక, ధీక్షిత్, అను ఇమ్మాన్యుయేల్‌తో కలిసి సృష్టించిన ఈ సినిమా కచ్చితంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. "థియేటర్లలో ఈ సినిమాను వీక్షించి అనుభూతి చెందండి, ఆలోచించండి. చిత్ర బృందానికి నా ప్రేమ, అభినందనలు" అని విజయ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa