స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రానున్న భారీ చిత్రంపై కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. అలాగే ఈ నెల 15న 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.ఈ మేరకు రాజమౌళి తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. "ప్రస్తుతం ముగ్గురు ప్రధాన నటులతో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. దీంతో పాటు 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ కోసం కూడా భారీగా సన్నాహాలు చేస్తున్నాం. గతంలో మేము చేసిన దానికంటే ఇది చాలా భిన్నంగా, కొత్తగా ఉండబోతోంది. ఈ నెల 15న మీ అందరికీ ఇది కచ్చితంగా గొప్ప అనుభూతిని పంచుతుంది" అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌కు ముందుగా ఈ రోజు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa