మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థినిని తోటి విద్యార్థి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం మృతదేహంతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సమయంలో నిందితుడు క్షుద్రపూజలు కూడా చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని మానసిక స్థితిని, నేరం చేసిన తీరును పరిశీలిస్తున్నారు. కేవలం హత్య చేయడమే కాకుండా, శవంపై అఘాయిత్యానికి పాల్పడటం, మంత్రవిద్యలు, క్షుద్ర పూజల వంటి చర్యలకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa