మోహన్ లాల్ నటించిన 'వృషభ' సినిమా అనుకున్నట్లే వాయిదా పడింది. రూ. 70 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం తొలుత అక్టోబర్ 18న విడుదల కావాల్సి ఉండగా, నవంబర్ 6కి వాయిదా వేసింది మూవీ టీం. అయితే, తాజాగా మరోసారి వాయిదా వేసి, ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా వాయిదాకు వీఎఫ్ఎక్స్ కారణమని సమాచారం. టాలీవుడ్‌లో ఈ క్రిస్మస్‌కు 'రోషన్ ఛాంపియన్', 'ఆది సాయి కుమార్ శంభాల', 'గుణశేఖర్ యుఫోరియా' రిలీజ్ కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa