దర్శకుడు సాయిశేఖర్ దర్శకత్వంలో టి.నరేష్‌కుమార్, శ్రీధర్ నిర్మాతలుగా సిద్ధార్థ్ కథానాయకుడిగా కేథరిన్ హీరోయిన్ గా టి.అంజయ్య సమర్పిస్తున్న చిత్రం వదలడు. ఈ చిత్రం వచ్చే నెల 11న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు. ఏలూరు సురేందర్ రెడ్డి, నట్టికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై టీజర్‌ని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ వదలడు.. దెయ్యం అయినా సరే అనే పేరుతో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్, హారర్ నేపథ్యం ఆకట్టుకునేలా ఉంటాయి అన్నారు. అంజయ్య మాట్లాడుతూ ప్రేమ అంత ఈజీ కాదు, కిల్లర్, కె.కె తో మా సంస్థ పారిజాత క్రియేషన్స్‌కి గుర్తింపు వచ్చిందని, వదలడు ప్రేక్షకాదరణ పొందుతుంది అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa