ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజురోజుకి ముదురుతున్న 'టాక్సిక్' సినిమా టీజర్ వివాదం

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 05:51 PM

యష్ హీరోగా రూపొందుతున్న 'టాక్సిక్' సినిమా టీజర్ చుట్టూ అలముకున్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్య చేయలేనని తెలిపారు. ఈ సందర్భంగా డిజిటల్ మీడియా కంటెంట్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.టాక్సిక్ టీజర్ వివాదంపై ఈ దశలో తాను వ్యాఖ్యానించలేనని పేర్కొన్న ఆయన, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే చాలా వీడియోలకు సెన్సార్ సర్టిఫికెట్ ఉండదని తెలిపారు. అవి తమ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలని సూచించారు. చూసే ప్రతి కంటెంట్ సెన్సార్ పొందిందే అన్న భావన నుంచి ప్రేక్షకులు బయటపడాలన్నారు. ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉంటుందని చాలా మంది భావిస్తారని కానీ అవి తమ వద్దకు రావని, వాటికి ధ్రువీకరణ ఉండదని ప్రసూన్ జోషి స్పష్టం చేశారు.అలాగే ఇటీవల వివాదాస్పదంగా మారిన మరో మూవీ జన నాయగన్‌పై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఆ అంశం ప్రస్తుతం చట్టపరమైన పరిధిలో ఉందని, విచారణ కొనసాగుతోందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa