సంక్రాంతి రేసులో కొంత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చినా, బలమైన మౌత్ టాక్‌తో శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం, స్వచ్ఛమైన కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. మొదట పరిమిత థియేటర్లలో విడుదలైనప్పటికీ, రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ తో స్క్రీన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఈ చిత్రం సంక్రాంతి సక్సెస్ మూవీగా నిలిచింది.ఈ విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ, చాలా కాలంగా ఎదురుచూస్తున్న పెద్ద హిట్‌ను ఈ సినిమా ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. మంచి కంటెంట్ ఉంటే విడుదల తేదీ ప్రభావం ఉండదని ఈ సినిమా నిరూపించిందన్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు పనితీరును ప్రశంసించిన ఆయన, నరేశ్ పాత్రకు వస్తున్న స్పందన ప్రత్యేకమని తెలిపారు. సంక్రాంతి సీజన్ తనకు కలిసొస్తుందని అన్నారు. ఇకపై ప్రతి సంక్రాంతికి ఒక సినిమా స్లాట్ రిజర్వ్ చేసుకోవాలని నవ్వుతూ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa