ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాషన్ డిజైనర్ వాలెంటినో గరవాని కన్నుమూత

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 02:48 PM

ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్, 'వాలెంటినో' బ్రాండ్ వ్యవస్థాపకుడు వాలెంటినో గరవాని (93) కన్నుమూశారు. సోమవారం రోమ్‌లోని తన నివాసంలో ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఆయన ఫౌండేషన్ అధికారికంగా ప్రకటించింది. వయోభారంతోనే ఆయన మరణించినట్లు తెలుస్తోంది.వాలెంటినో తన కుటుంబ సభ్యుల సమక్షంలో కన్నుమూసినట్లు 'ఫొండాజియోన్ వాలెంటినో గరవాని ఇ జియాన్కార్లో గియామెట్టి' ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన మృతి పట్ల ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. "వాలెంటినో స్టైల్, సౌందర్యానికి తిరుగులేని మాస్టర్. ఇటాలియన్ హై ఫ్యాషన్‌కు శాశ్వత చిహ్నం. ఇటలీ ఒక లెజెండ్‌ను కోల్పోయింది" అని ఆమె నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa