ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జాయ్ అవార్డ్స్ 2026' వేడుకలో అభిమానులని ఆకట్టుకున్న షారుఖ్ ఖాన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 01:24 PM

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇటీవల సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన 'జాయ్ అవార్డ్స్ 2026' వేడుకలో పాల్గొన్నారు. నలుపు రంగు దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై నడిచివచ్చిన ఆయన ఎప్పటిలాగే అందరినీ ఆకట్టుకున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ఆయన దుస్తుల కన్నా ఎక్కువగా ఆయన చేతికి ఉన్న ఖరీదైన వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. దాని ధర, ప్రత్యేకతలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.షారుఖ్ ధరించింది అత్యంత అరుదైన రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా సఫైర్ మోడల్ వాచ్. దీని విలువ సుమారు 15 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ. 13.5 కోట్లకు పైమాటే. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేసిన ఈ వాచ్ కేస్‌పై 54 వజ్రాలు, బెజెల్‌పై 36 నీలమణి రాళ్లను పొదిగారు. కాంతిని బట్టి రంగులు మారే సిల్వర్ అబ్సిడియన్ డయల్ దీని మరో ప్రధాన ఆకర్షణ.ఈ వాచ్‌ను రోలెక్స్ సంస్థ తన అధికారిక కేటలాగ్‌లో ఎక్కడా ప్రదర్శించదు. అందుకే దీన్ని 'ఘోస్ట్ వాచ్' అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ వాచ్‌ను కేవలం తమ అత్యంత ముఖ్యమైన VVIP క్లయింట్ల కోసం మాత్రమే ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి కొన్ని మాత్రమే ఉన్నాయని, దీన్ని మ్యూజియం గ్రేడ్ కలెక్టబుల్‌గా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa