ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘భగవంత్‌ కేసరి’ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అనిల్ రావిపూడి

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 01:20 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విజయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రోజుకో కొత్త రికార్డును సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్‌ రావిపూడి, తాను గతంలో దర్శకత్వం వహించిన ‘భగవంత్‌ కేసరి’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘బాలకృష్ణతో ఎవరూ ఊహించని విధంగా ఒక సినిమా చేయాలనుకున్నాను. నా కెరీర్‌లో ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌లలో ‘భగవంత్‌ కేసరి’ ఒకటి. కానీ, ఆ సినిమా ఇంకా పెద్ద హిట్‌ కావాల్సింది. సినిమా విడుదలైన సమయంలో చంద్రబాబు నాయుడు జైలులో ఉండటం వల్ల బాలయ్య అభిమానుల్లో కొంత నిరాశ కనిపించింది. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమాను ఆదరించి హిట్‌ చేశారు. పరిస్థితులు అనుకూలంగా ఉండి ఉంటే ఈ చిత్రానికి మరింత గొప్ప స్పందన వచ్చేది’’ అని అనిల్‌ అన్నారు.అలాగే, విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయగన్‌’ సినిమా స్క్రిప్ట్‌కు తాను సహాయం చేసిన తర్వాత, ఆ సమయంలో ఉన్న నిరాశ నుంచి కొంతవరకు బయటపడ్డానని కూడా అనిల్‌ రావిపూడి తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa