ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏనుగును దత్తత తీసుకున్న హీరో శివ కార్తికేయన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 01:43 PM

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వండలూర్ జూ పార్క్‌లోని ఓ ఏనుగును ఆయన దత్తత తీసుకున్నారు. ప్రకృతి అనే పేరు గల ఆ ఏనుగు సంరక్షణ బాధ్యతలను ఆరు నెలల పాటు శివ కార్తికేయన్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఈ విషయాన్ని జూ పార్క్ అధికారులు అధికారికంగా ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హీరో చేసిన ఈ మంచి పనికి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక శివ కార్తికేయన్ సినిమాల విషయానికి వస్తే, ఆయన నటించిన 'పరాశక్తి' చిత్రం పొంగల్ కానుకగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 10న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాను రాజకీయాలతో ముడిపెట్టడంతో కొంత వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa