ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో ఆ పాట పాడింది చిరంజీవి మేనకోడలు అంట

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 02:02 PM

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ జనవరి 12న విడుదలైంది. విడుదలైన రోజు నుంచే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతూ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రంలోని "ఫ్లై.. హై" అంటూ సాగే పాటకు అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ పాటకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ పాటను మెగాస్టార్ చిరంజీవి మేనకోడలు నైరా ఆలపించినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఆయన ఒక పోస్ట్ చేశారు. నైరా చిరంజీవి సోదరి మాధవి కుమార్తె అని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa