ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైరా లో చరణ్ ఆ పాత్రలో నటించాల్సిందట...

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 05:30 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్నారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటించాల్సిందట. కానీ, కొన్ని కారణాల వల్ల రామ్ చరణ్ సైరాలో నటించలేదని చెప్పారు చిరు. ఈ విషయం గురించి మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘సైరా’లో చరణ్‌ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తే బాగుంటుందని మొదట భావించాం. ఆ పాత్రే షేర్‌ ఖాన్‌ పాత్ర. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ఈ పాత్రలో సల్మాన్‌ ఖాన్‌, లేదా సంజయ్‌ దత్‌ లలో ఎవరో ఒకరితో వేయిస్తే బాగుంటుందని చరణ్‌ అభిప్రాయపడ్డాడు. కానీ ఎందుకో వాళ్ళు ఆ పాత్ర చేయటానికి ముందుకు రాలేదు. ఇక అప్పుడు చరణ్‌ తోనే షేర్‌ ఖాన్‌ పాత్ర చేయించాలని నిర్ణయించుకున్నాం. అయితే కథ పరంగా షేర్‌ ఖాన్‌ పాత్రతో నాకు పోరాట సన్నివేశాలు ఉంటాయి. ఆ సమయంలో షేర్‌ ఖాన్‌ పాత్ర, ‘నరసింహారెడ్డీ.. నీ లాంటివాడు దేశానికి కావాలి’ అని నా చేతిలోని కత్తితో పొడుచుకొని, చనిపోతుంది. నా పాత్ర చేతిలో చరణ్‌ పాత్ర చనిపోవడం యాంటీ సెంటిమెంట్‌ గా అనిపించింది. కానీ అంతలోనే కథకు అవసరం లేదని ఆ ఎపిసోడ్‌ ను పక్కన పెట్టేశాం. అలా ‘సైరా’లో రామ్‌ చరణ్‌ నటించలేదు’. కాగా ప్రస్తుతం రిలీజ్ అవుతోన్న అన్ని భాషల్లో సైరా ప్రమోషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు నటిస్తుండంతో సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa